భారతదేశం, మే 11 -- IRCTC Chardham Yatra Package : హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్రను దర్శించుకోవాలని ఆకాంక్షించే భక్తుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఉత్తరాఖండ్‌లోని దివ్య క్షేత్రాలను సందర్శించేలా 'చార్ ధామ్ యాత్ర ఎక్స్ - హైదరాబాద్' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది.

ఈ ప్యాకేజీలో మొత్తం 10 రాత్రులు, 11 రోజులుగా ఉంటుంది. 2026 మే నెలలో 17, 18, 28వ తేదీల్లో జర్నీలు ఉంటాయి. ఈ తేదీలకు అనుగుణంగా భక్తులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్ చేరుకుని... అక్కడ నుంచి రోడ్డు మార్గంలో యాత్రను కొనసాగిస్తారు.

హైదరాబాద్ నుంచి ఉదయం 08:45 గంటలకు బయలుదేరే విమానం (6E 422) ఉదయం 11:15 గంటలకు డెహ్రాడూన్ చేరుకుంటుంది. తిరిగి వచ్చేటప్పుడు డ...