భారతదేశం, నవంబర్ 1 -- Indiramma LIG Flats Hyderabad : హైదరాబాద్ మహానగరంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్న నిరుపేదలు, అల్పదాయ వర్గాల ప్రజలకు తెలంగాణ హౌసింగ్ బోర్డు మరో అప్డేట్ అందించింది. కోర్ అర్బన్ పరిధికి చెందిన మరో నాలుగు కీలక నియోజకవర్గాల్లో ఇందిరమ్మ లో-ఇన్‌కమ్ గ్రూప్ (LIG) ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు నవంబరు 3వ తేదీన పారదర్శకంగా ఆన్‌లైన్ లాటరీ (ఇ-లాటరీ) నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ వెల్లడించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లో నిర్మించిన ఇందిరమ్మ టవర్లలో ఈ ఫ్లాట్లను దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. గత కొంతకాలంగా ఈ ఫ్లాట్ల కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ప్రజలు నిరీక్షిస్తున్నారు. ప్రజ...