భారతదేశం, ఆగస్టు 15 -- 80వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో దిల్లీ ఎర్రకోటలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతర గీతాన్ని ఈవెంట్​లో ఆలపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చరుకున్నారు. మరికొద్దిసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్​ఘాట్​కు వెళ్లారు ప్రధాని మోదీ. మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు.

భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టడానికి ప్రాణాలర్పించిన మహానీయుల ధైర్యం, త్యాగాలు, అంకితభావాన్ని స్మరించుకున్నారు. వారి కలలను సాకారం చేస్తూ, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు అందరం క...