భారతదేశం, అక్టోబర్ 28 -- హైదరాబాద్ నగరంలోని మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో లంచావతారం ఎత్తిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ). ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఓ కేసు నుంచి ఉపశమనం కల్పించేందుకు ఏకంగా లక్షల్లో లంచం డిమాండ్ చేసి.. ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా పట్టుబడ్డాడు.

ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. మీర్‌చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఫిర్యాదుదారుడి తండ్రిపై నమోదైన కేసును క్లోజ్ చేయడానికి, అతనిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండటానికి, భవిష్యత్తులో పోలీసు సాయం అందించడానికి సీఐ ఎం. కొండల్ రావు రూ. 6 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే.. మొదటి విడతగా రూ. 3 లక్షల లంచం మొత్తాన్ని పోలీసు స్టేషన్ పరిధిలోని హోంగార్డ్ ఆబిద్ అలీ ద్వారా స్వీకరించేందుకు నిర్ణయించారు.

బాధితుడు ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ స...