భారతదేశం, ఫిబ్రవరి 20 -- గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎల్జీబీటీక్యూ (LGBTQ+) కథాంశాలతో అనేక సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయి. అయితే, ఒక క్వీర్* వ్యక్తిగా సమాజంలో బతకడం అంటే ఏమిటి? క్రీడా ప్రపంచం వంటి కఠినమైన రంగాల్లో తమ గుర్తింపును దాచుకుంటూ జీవించడం ఎంత నరకం? అనే కోణాలను అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించిన సిరీస్ 'హీటెడ్ రైవల్రీ'. కెనడియన్ ప్రొడక్షన్ కంపెనీ 'క్రేవ్' నిర్మించిన ఈ సిరీస్, ఇప్పుడు మన దేశంలో 'లయన్స్‌గేట్ ప్లే' (Lionsgate Play) వేదికగా అందుబాటులోకి వచ్చింది.

రాచెల్ రీడ్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా దర్శకుడు జాకబ్ టైర్నీ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఐస్ హాకీ క్రీడలో ప్రత్యర్థులైన ఇద్దరు ఆటగాళ్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఒకరు కెనడియన్ ప్లేయర్ షేన్ హాలండర్ (హడ్సన్ విలియమ్స్), మరొకరు రష్యన్ ఆటగాడు ఇల్యా రోజనోవ్ (కానర్ స్టోరీ). మ...