భారతదేశం, ఆగస్టు 10 -- అమెరికాలో స్థిరపడి ఉద్యోగాలు కొనసాగించాలని భావిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వీసాల పొడిగింపు పిటిషన్లపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) నిబంధనలను సవరించింది. ఒకే కంపెనీలో పనిచేస్తూ వీసా కాలపరిమితిని పొడిగించుకునే ఉద్యోగులకు కూడా ఇకపై అదనపు రుసుములు వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.

హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన తుది ఉత్తర్వుల ప్రకారం, అర్హత కలిగిన ప్రతి హెచ్-1బీ పొడిగింపు పిటిషన్‌కు $4,000 (సుమారు రూ. 3.35 లక్షలు), ప్రతి ఎల్-1 పొడిగింపు పిటిషన్‌కు $4,500 (సుమారు రూ. 3.77 లక్షలు) అదనంగా చెల్లించాలి. అయితే ఈ భారం అమెరికాలోని అన్ని కంపెనీలపైనా పడదు.

అమెరికాలో కనీసం 50 మంది ఉద్యోగులు ఉండి, వారి...