భారతదేశం, అక్టోబర్ 22 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నిన్ను అడిగినందుకు నా చెప్పులతో నేను కొట్టుకోవాలని ప్రభావతి అంటే.. బయట ఉన్నాయి తీసుకురావాల అని మీనా కౌంటర్ ఇస్తుంది. ఇవాళ నాకు కరివేపాకు పచ్చడి తినాలని ఉందని ప్రభావతి అంటుంది.

కరివేపాకు లేదు. తీసుకురండని మీనా అంటే.. తీసుకురావడానికి ఎవరున్నారు. అందరూ బిజీనేగా అని ప్రభావతి అంటుంది. నేను కూడా బిజీనే. కరివేపాకు పచ్చడి మీరే చేసుకోండని వంట మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోతుంది మీనా. దాంతో ప్రభావతి ఆపి.. నువ్వు కూడా బిజీనే. కరివేపాకు సంగతి నేను చూసుకుంటా. వంట మాత్రం మధ్యలో వదిలిపెట్టకని అంటుంది ప్రభావతి.

మాటకు మాట సమాధానం ఇవ్వకుంటే వినరుగా అని వంట చేసేందుకు వెళ్తుంది మీనా. మనోజ్ వస్తే.. సంధు చివర కరివేపాకు తీసుకురారా. నాకు కరివే...