భారతదేశం, అక్టోబర్ 9 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ చిన్నపిల్లాడిలా ఓ కారు బొమ్మ తీసుకొచ్చుకుని ఆడుకుంటాడు. వీడు బయట ఎవరిదో బొమ్మ ఎత్తుకొచ్చాడనుకుంటారు. ఇంతలో ఒక ఆవిడ వచ్చి మీ అబ్బాయి మా అబ్బాయి బొమ్మ ఎత్తుకొచ్చాడని కోపంగా చెబుతుంది.

వయసు తగ్గినా బుద్ధి మారలేదని బాలు అంటాడు. ఆ బొమ్మ లాక్కుని వాళ్లకు ఇచ్చేస్తుంది ప్రభావతి. ఏవండి మీరే ఏదోటి చేయండని మీనా అంటుంది. దాంతో మనోజ్‌ను బాలు కొడతాడు. ఏంట్రా నువ్వు చేసింది అని ప్రభావతి తిట్టినట్టే తిట్టి రెండు చెంపలు ఒకేసారి వాయించాలని చెబుతుంది. అంతా షాక్ అవుతారు. ఒకేసారి మనోజ్ రెండు చెంపలను బాలు కొడతాడు.

దాంతో మనోజ్ కిందపడిపోతాడు. నీళ్లు కొట్టి లేపుతాడు. మనోజ్ ఎప్పటిలా మారిపోతాడు. ఏమైందని అడుగుతాడు. ఏం కాలేదని రోహిణితో పంపిస్...