Gold price today Nov 21: దిగివచ్చిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
భారతదేశం, నవంబర్ 21 -- ఆభరణాల ప్రియులు, మదుపర్లకు ఊరటనిస్తూ బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఐదు రోజుల పాటు క్షీణించిన పసిడి, ఈ ఒక్క వారంలోనే దాదాపు 9 శాతం మేర కుప్పకూలింది. 2026 మార్చి తర్వాత బంగారానికి ఇదే అతిపెద్ద వారపు నష్టమని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.
బులియన్ మార్కెట్లో ఈ వారం పసిడి సుమారు 9 శాతం నష్టపోయి, ఔన్సు 3,500 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. 2025 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. మరోవైపు వెండి సైతం ఈ వారం ఏకంగా 15 శాతం పతనమైంది. విలువైన లోహాలన్నీ వరుసగా రెండో వారమూ నష్టాల బాట పట్టడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
శుక్రవారం ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ధర 3 శాతం తగ్గి ఔన్సు 3,514.08 డాలర్లకు చేరింది. డిసెంబర్ డెలివరీ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 4.6 శాతం క్షీణించి ఔన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.