భారతదేశం, నవంబర్ 21 -- ఆభరణాల ప్రియులు, మదుపర్లకు ఊరటనిస్తూ బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఐదు రోజుల పాటు క్షీణించిన పసిడి, ఈ ఒక్క వారంలోనే దాదాపు 9 శాతం మేర కుప్పకూలింది. 2026 మార్చి తర్వాత బంగారానికి ఇదే అతిపెద్ద వారపు నష్టమని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.

బులియన్ మార్కెట్లో ఈ వారం పసిడి సుమారు 9 శాతం నష్టపోయి, ఔన్సు 3,500 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. 2025 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. మరోవైపు వెండి సైతం ఈ వారం ఏకంగా 15 శాతం పతనమైంది. విలువైన లోహాలన్నీ వరుసగా రెండో వారమూ నష్టాల బాట పట్టడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

శుక్రవారం ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ధర 3 శాతం తగ్గి ఔన్సు 3,514.08 డాలర్లకు చేరింది. డిసెంబర్ డెలివరీ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 4.6 శాతం క్షీణించి ఔన...