భారతదేశం, నవంబర్ 3 -- Vishwak Sen Ee Nagaraniki Emaindi 2 Trailer Srinath Maganti: తెలుగు ప్రేక్షకుల్లో, ప్రత్యేకించి యూత్‌లో 'ఈ నగరానికి ఏమైంది' (ENE) సినిమా సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్నేహం, మద్యం, కలలు, హ్యూమర్ కలగలిపిన ఆ చిత్రం థియేటర్లలోనే కాకుండా ఓటీటీ స్పేస్‌లోనూ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.

ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా 'ఈ నగరానికి ఏమైంది 2' (ENE 2). ఈఎన్ఈ 2 విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రచార వేగాన్ని పెంచారు. నవంబర్ 19న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మంగళవారం (నవంబర్ 3) అంటే ఇవాళ విడుదల చేశారు.

ఈ నగరానికి ఏమైంది రిపీట్ ట్రైలర్ చూస్తుంటే ఆనాటి నవ్వుల ప్రయాణం మళ్లీ కళ్లముందు సాగుతున్న అనుభూతి కలుగుతోంది. నలుగురు స్నేహితుల గ్యాంగ్ చుట్టూ తిరిగే కథలో ఈస...