భారతదేశం, నవంబర్ 21 -- Drishyam 3 The Conclusion OTT Release Official Announcement: థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు 'దృశ్యం' ఫ్రాంచైజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విక్టరీ వెంకటేష్ నటించిన తెలుగు వెర్షన్లతో ఇక్కడ ఇంటింటా మారుమోగిన ఈ కథ, బాలీవుడ్‌లోనూ అజయ్ దేవగన్ హీరోగా కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకుంది.

గత రెండు భాగాలు సూపర్ హిట్ కావడంతో భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2, 2026న థియేటర్లలోకి వచ్చిన 'దృశ్యం 3: ది కన్‌క్లూజన్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ మూవీ దృశ్యం 3 ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్ 27 నుంచి దృశ్యం 3 ది కన్‌క్లూజన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

అయితే, 'దృశ్యం 3' విడుదలకు మొదటి నుంచీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. మలయా...