భారతదేశం, మార్చి 7 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' (Dhurandhar: The Revenge) ట్రైలర్ ఇవాళ శనివారం (మార్చి 7) విడుదలైంది.

గతేడాది రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన 'ధురంధర్'కు ఈ సినిమా సీక్వెల్ అని తెలిసిందే. మొదటి భాగంలో భారతీయ గూఢచారిగా శత్రువుల గుండెల్లో నిద్రపోయిన రణ్‌వీర్ సింగ్ ఈసారి ఏకంగా 'లయారీ బాద్‌షా'గా పాకిస్థాన్ గడ్డపై ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

ధురంధర్ 2 ది రివేంజ్ ట్రైలర్ విషయానికి వస్తే.. జస్క్రీత్ సింగ్ రంగీ (రణ్‌వీర్ సింగ్) తిరిగి రావడంతో కథలో వేడి పెరిగింది. బలోచ్ ముఠా నాయకుడు రెహ్మాన్ డకైత్ (అక్షయ్ ఖన్నా)ను అంతం చేసిన తర్వాత, అదే గ్యాంగ్‌లో ఉంటూ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కూకటివేళ...