భారతదేశం, మార్చి 30 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గూఢచారి విన్యాసం 'ధరంధర్ 2: ది రివెంజ్' థియేటర్లలో చరిత్ర సృష్టిస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాను వెండితెరపై చూసిన ప్రేక్షకులు, ఇప్పుడు డిజిటల్ వేదికపై ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొదటి భాగం ధురంధర్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కాగా.. సీక్వెల్ మాత్రం రూటు మార్చింది. అంటే, నెట్‌ఫ్లిక్స్‌లో కాకుండా మరో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.

బాలీవుడ్ హంగామా, పింక్‌విల్లా కథనాల ప్రకారం, ధురంధర్ 2 ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) కైవసం చేసుకుంది. మార్చి 19న థియేటర్లలోకి వ...