భారతదేశం, ఆగస్టు 2 -- Cocktail 2 OTT Streaming Official: బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా కాక్‌టెయిల్ 2 ఓటీటీ ప్రియులను అలరించేందుకు వేదిక సిద్ధం చేసుకుంది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, హిందీ భామ కృతి సనన్ తొలిసారి కలిసి నటించిన ఈ మూవీ థియేటర్లలో రికార్డు స్థాయి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

థియేటర్లలో చూడటం మిస్సయిన వారి కోసం ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ప్రముఖ దర్శకుడు హోమీ అదాజానియా తెరకెక్కించిన కాక్‌టెయిల్ 2 జూన్ 19న గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఆరో స్థానంలో ఈ సినిమా నిలిచింది.

కాక్‌టెయిల్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగా వసూళ్లతో మంచి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా ఐఎ...