భారతదేశం, జూన్ 22 -- Rashmika Mandanna Cocktail 2 Box Office Collection Day 3: స్టార్ హీరో షాహిద్ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, గ్లామరస్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2). భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది.

కాక్‌టెయిల్ 2 సినిమాకు క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మొదటి వీకెండ్‌లో వసూళ్లు క్రమంగా పెరుగుతూ ట్రేడ్ వర్గాలను ఆకట్టుకున్నాయి. సెలవు దినం కావడంతో ఆదివారం (జూన్ 21) నాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి పట్టు సాధించింది.

ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ 'శాక్‌నిల్క్' అందించిన వివరాల ప్రకారం, 'కాక్‌టెయిల్ 2' విడుదలైన మూడో రోజు (ఆదివారం) దేశవ్యాప్తంగా రూ. 17.75 కోట్ల నెట్ కలెక్షన్లను రాబ...