భారతదేశం, సెప్టెంబర్ 8 -- Bigg Boss Telugu 10 Magical Powers To 10 Contestants: బిగ్ బాస్ 10 తెలుగు మొదటి రోజే రసవత్తరంగా సాగింది. తొలిరోజునే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్లుగా పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 7 ఎపిసోడ్‌లో మ్యాజికల్ పవర్స్ ఇచ్చే కీస్ గురించి చర్చ మొదలైంది.

బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్ లాంచ్ రోజున టాస్కుల్లో గెలిచి 8 మంది ఆ మ్యాజికల్ పవర్ కీస్ గెలుచుకున్నారు. మిగతా ఇద్దరికి రెండు కీస్ నిర్ణయించి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడి. చాలా సేపు వాగ్వాదం, గొడవ తర్వాత టెంపర్ వంశీ, నటుడు కృష్ణుడికి ఆ తాళం చెవులు ఇవ్వాలని నిర్ణయించి ఇచ్చారు.

ఆ తర్వాత పదిమంది కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి పేరును బిగ్ బాస్ చెప్పడంతో వారు వెళ్లి ఆ పవర్ ఏంటో తెలుసుకున్నారు. కానీ, ఆ పవర్ ఏంటనేది మరే ఇతర కంటెస్టెంట్‌కు చెప్పినా, తెలి...