భారతదేశం, ఆగస్టు 13 -- Bigg Boss Agnipariksha 2 Abijeet Lady Contestant: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ 10 సందడి నెలకొంది. సెప్టెంబర్‌లో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సీజన్‌లోకి సామాన్యులను పంపేందుకు నిర్వహించే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 కూడా ఆగస్ట్ 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ప్రోమోలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది స్టార్ మా. ఈ క్రమంలోనే రిలీజ్ చేసిన లేటెస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రోమోలో ఇంట్రెస్టింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అగ్ని పరీక్షకు హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవి, బిగ్ బాస్ తెలుగు 4 విజేత, హీరో అభిజీత్ దుద్దాల జడ్జెస్‌గా ఉన్న విషయం తెలిసిందే.

ఇక లేటెస్ట్ అగ్ని పరీక్ష 2 ప్రోమోలో ఓ కంటెస్టెంట్ వస్తే.. నీ పర్సనాలిటీ ఏంటీ, ఒక మనిషిగా నువ్వు ఏంటని నవద...