భారతదేశం, ఆగస్టు 24 -- Bigg Boss Agnipariksha 2 Elimination: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2' షో ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 10 హౌజ్‌లోకి అడుగుపెట్టేందుకు కంటెస్టెంట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న వివాదాలు, కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలతో ఈ తెలుగు రియాలిటీ ఓటీటీ షో మంచి వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంటోంది. మరో రెండు రోజుల్లో ఈ షో షూటింగ్ పూర్తి కానుండగా, ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్ ట్విస్టులు బయటకు వచ్చాయి.

ఇప్పటికే టాప్ 15 కంటెస్టెంట్ల కోసం ఓటింగ్ లైన్లు తెరిచారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం గాయత్రీ ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎపిసోడ్‌లో వచ్చిన ఎల్లో కార్డుతో పాటు జడ్జిలు కూడా మరొక ఎల్లో కార్డు ఇవ్వడంతో ఆమె నిష్క్రమణ ఖాయమైంది.

ఈ ఎపిసోడ్ ...