భారతదేశం, సెప్టెంబర్ 11 -- Avengers Endgame Encore Re Release Advance Booking: హాలీవుడ్ రికార్డులను తిరగరాసిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) మాయాజాలం మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న 'అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్‌కోర్' చిత్రం బిగ్ స్క్రీన్లపై రీఎంట్రీ ఇస్తోంది.

అంటే, అవెంజర్స్ ఎండ్‌గేమ్‌ను ఎన్‌కోర్ టైటిల్‌తో రీ రిలీజ్ చేస్తోంది మార్వెల్ సంస్థ. సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్‌కోర్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సంబంధించిన అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్‌కోర్ టికెట్ బుకింగ్స్‌ను మార్వెల్ స్టూడియోస్ అధికారికంగా ప్రారంభించింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ మార్వెల్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. హైదరాబాద్‌లోని ప్రధాన థి...