భారతదేశం, జూన్ 7 -- ఆంధ్రప్రదేశ్‌లో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపు, పర్యవేక్షణలో సరికొత్త విప్లవానికి నాంది పలకబోతున్నారు. వైద్యారోగ్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ - కృత్రిమ మేధస్సు) ఆధారిత సేవలను వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో దైనందిన విధులను నిర్వహించే ఆశా (ASHA) కార్యకర్తలు ఉపయోగించే అధికారిక మొబైల్ యాప్‌లోనే ఈ సరికొత్త ఏఐ ఫీచర్‌ను అనుసంధానం చేయనున్నారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో కుదుర్చుకున్న ప్రత్యేక అవగాహన ఒప్పందంలో భాగంగా ప్రముఖ సాంకేతిక సంస్థ 'వాద్వానీ-ఏఐ' (Wadhwani-AI) ఈ సరికొత్త 'శిశు మాపన్ యాప్'ను రూపకల్పన చేసింది. ఈ యాప్ ద్వారా నవజాత శిశువుల శారీరక ఎదుగుదలకు సంబంధించిన కీలక పారామీటర్లయిన బరువు, ఎత్తు, ఛా...