భారతదేశం, జూలై 26 -- Ameer Log Release Date And Avval Dawath Song Launch: 'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం 'అమీర్ లోగ్'. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

అలాగే, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి ఇతర కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. ఆగస్ట్ 21న అమీర్ లోగ్ మూవీని విడుదల చేయనున్నట్లుగా శనివారం (జూలై 25) నాడు ప్రకటించారు.

అమీర్ లోగ్ రిలీజ్ డేట్‌తో పాటుగా 'అవ్వల్ దావత్' సాంగ్‌ని కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు రమణా రెడ్డి, నిర్మాత మాధవి రెడ్డి...