భారతదేశం, ఆగస్టు 20 -- Ameer Log Press Meet Director Ramana Reddy On Malayalam Movies: టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ హైదరాబాదీ చిత్రం అమీర్ లోగ్. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ముగ్గురు యంగ్ హీరోలు నటించిన ఈ సినిమాలో వేధా జలంధర్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు.

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తొలి చిత్రంగా అమీర్ లోగ్‌ని నిర్మించారు. అలాగే, ఈ మూవీకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' విడుదల చేస్తోంది.

అమీర్ లోగ్ సినిమాను తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా అంటే రేపు థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో బుధవారం (ఆగస్ట్ 19) అమీర్ లోగ్ మూవీ యూనిట్ ప్రెస్ మీట్‌ను ని...