భారతదేశం, జూలై 25 -- Rings Of Power Season 3 OTT Release Teaser Out: ఫాంటసీ వెబ్ సిరీస్‌ల ప్రేమికులకు అమెజాన్ ప్రైమ్ వీడియో మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ అందించింది. హాలీవుడ్ ప్రముఖ ఈవెంట్ 'శాన్ డియాగో కామిక్-కాన్ 2026'లో హాల్-హెచ్ వేదికగా 6,500 మందికి పైగా అభిమానుల సమక్షంలో 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' (The Lord of the Rings: The Rings of Power) సీజన్ 3 టీజర్‌ను అత్యంత వేడుకగా ఆవిష్కరించారు.

ఈ ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్ నవంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గత రెండు సీజన్ల కంటే ఈ మూడో సీజన్ అత్యంత భయంకరంగా, ఆసక్తికరంగా సాగనుందని మేకర్స్ జె.డి.పేన్, ప్యాట్రిక్ మెక్‌కే స్పష్టం చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో రూపుదిద్దుకున్న 99 సెకన్ల ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంద...