భారతదేశం, జూలై 4 -- Alpha OTT Release Details: భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' (YRF Spy Universe) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పఠాన్, టైగర్, వార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత ఈ క్రేజీ యూనివర్స్ నుంచి వచ్చిన సరికొత్త హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆల్ఫా' (Alpha).

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, యంగ్ బ్యూటీ శార్వరి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎట్టకేలకు వెండితెరపైకి వచ్చేసింది. ఈ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి లేడీ ఓరియెంటెడ్ స్పై సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

నిన్న (జూలై 3) థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ విందును ఆస్వాదిస్తున్న సినీ ప్రియులు.. అప్పుడే ఆల్ఫా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు, ఎక్కడ అనే వ...