భారతదేశం, అక్టోబర్ 31 -- Venkatesh Aadarsha Kutumbam OTT Vishwak Sen #Cult OTT: నిన్న (అక్టోబర్ 30) థియేటర్లలో విడుదలైన రెండు క్రేజీ సినిమాల ఓటీటీ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఒకటి విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' కాగా మరోటి విశ్వక్ సేన్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన సినిమా #కల్ట్.

హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన 'ఆదర్శ కుటుంబం హౌజ్ నెం 47' చిత్రాన్ని నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రొడక్షన్ ఖర్చులు, పబ్లిసిటీతో కలిపి దాదాపు రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో తీశారు.

వెంకటేష్ సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా అలరించగా, నారా రోహిత్, నివేదా పెతురాజ్, యువీనా, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ వం...