భారతదేశం, మే 28 -- Heist Movie Based On 950 Cr Louvre Museum Theft: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటైన పారిస్‌లోని ప్రముఖ 'లౌవ్రే మ్యూజియం' (Louvre Museum) లో గతేడాది జరిగిన దోపిడీ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ఈ మ్యూజియంలోకి చొరబడిన దొంగలు.. ఏకంగా 100 మిలియన్ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ. 950 కోట్లకు పైగా) విలువైన పురాతన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

అయితే, ఈ చోరీలో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిన విషయం ఏమిటంటే.. దొంగలు ఎంతో క్యాజువల్‌గా లోపలికి నడుచుకుంటూ వచ్చి, అంతే కూల్‌గా నగల మూటతో బయటకు వెళ్లడం. హాలీవుడ్ యాక్షన్ సినిమాలను తలపించేలా సాగిన ఈ రియల్ లైఫ్ రాబరీ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ఏఎఫ్‌పీ' (AFP) మంగళవారం (మే 26) ఒక కథనాన్ని ప్రచురించిం...