భారతదేశం, నవంబర్ 27 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8వ సీపీసీ) కసరత్తు వేగవంతమైంది. వివిధ ఉద్యోగ సంఘాలు సమర్పించిన 2.92 నుంచి 4.00 మధ్య ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రతిపాదనలను కమిషన్ ప్రస్తుతం పరిశీలిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా తుది గుణకాన్ని (మల్టిప్లయర్) ప్రకటించనప్పటికీ, ప్రతిపాదిత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లు అమలైతే వివిధ పే లెవల్స్‌లో ప్రాథమిక వేతనం (బేసిక్ పే) ఏ స్థాయికి చేరుతుందన్న లెక్కలు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అక్టోబరులో 8వ వేతన సంఘం రెండు కీలక సమావేశాలు నిర్వహించింది. అక్టోబరు 8న బెంగళూరులో, అక్టోబరు 23న ముంబయిలో ఈ భేటీలు జరిగాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించిన వేతనాలు, పింఛన్లు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, భత్యాల...