భారతదేశం, జూన్ 1 -- తెలంగాణలో ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ (Hyderabad-Chennai High Speed Rail Corridor) అలైన్‌మెంట్‌లో నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ భారీ మార్పులు చేసింది. గతంలో హైదరాబాద్-బెంగళూరు రూట్‌ను మార్చినట్లే.. ఇప్పుడు చెన్నై రూట్‌ను కూడా రీ-డిజైన్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యతలను, ముఖ్యంగా ప్రతిపాదిత 'ఫ్యూచర్ సిటీ', డ్రై పోర్ట్ ప్రాజెక్టులను అనుసంధానిస్తూ ఈ కొత్త రూట్‌ను ఖరారు చేశారు. ఈ మార్పుల వల్ల తెలంగాణ పరిధిలో బుల్లెట్ ట్రైన్ ప్రయాణ దూరం భారీగా తగ్గడమే కాకుండా, భూసేకరణ భారం కూడా తగ్గనుంది.

తొలి ప్రతిపాదన ప్రకారం.. ఈ హైస్పీడ్ రైలు శంషాబాద్ నుంచి ప్రారంభమై బాటాసింగారం, నార్కట్‌పల్లి,...