భారతదేశం, అక్టోబర్ 21 -- హైదరాబాద్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల నుంచి అక్టోబర్ 24వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు నగరం వ్యాప్తంగా, ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. పిటిసీ/పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్ బేబీ పాండ్స్, సంజీవయ్య పార్క్ మార్గాల్లో విగ్రహాల నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు.

పంజాగుట్ట, రాజ్‌భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు: పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను వి.వి.స్టాచ్యూ వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.

నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు: ఈ మార్గంలో వచ్చే వాహనాలను ఓల్డ్ పి.ఎస్. సైఫాబాద్ వ...