భారతదేశం, జూలై 3 -- రాష్ట్రంలోని క్రైస్తవ మైనారిటీ సామాజిక వర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీల ఆర్థిక కార్పొరేషన్ (TSCMFC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 'ఆర్థిక సహాయ పథకం' కింద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి. సబిత ఒక ప్రకటనలో కోరారు.

ఈ పథకం కింద విభిన్న ఉపాధి రంగాలకు సంబంధించిన యూనిట్లను ప్రభుత్వం కేటాయించనుంది. కుట్టు మిషన్లు , చిన్న తరహా వ్యాపారాల నిర్వహణకు ఒక విభాగంగా... అలాగే ఈ-బైక్ (E-Bike), ఈ-స్కూటీ , మోటార్ బైక్ యూనిట్లను మరొక విభాగంగా నిర్ధారించారు. దరఖాస్తుదారుల వయస్సు, విద్యార్హతలను బట్టి ఈ యూనిట్లను మంజూరు చేస్తారు.

అర్హత కలిగిన క్రైస...