భారతదేశం, మే 15 -- ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తె ఉన్నత చదువుల గురించి, పెళ్లి గురించి కలలు కంటారు. ఆ కలలను నిజం చేసే క్రమంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమే 'సుకన్య సమృద్ధి యోజన' (SSY). ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలన్నింటిలోనూ ఇది అత్యధిక వడ్డీని అందిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది.

ప్రస్తుతం సుకన్య సమృద్ధి పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఉన్న రేటునే కేంద్రం ఈ క్వార్టర్లోనూ కొనసాగించాలని నిర్ణయించింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజ బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) వడ్డీ రేట్ల కంటే ఇది చాలా...