సికింద్రాబాద్ లష్కర్ బోనాలు 2026: జూలై 19 నుంచి ఉత్సవాలు, ఆగస్టు 2న ప్రధాన బోనం
భారతదేశం, జూన్ 17 -- తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన ఆషాఢ మాస బోనాల జాతరకు సికింద్రాబాద్ లష్కర్ సిద్ధమవుతోంది. ప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల ఉత్సవాల పూర్తి షెడ్యూల్‌ను ఆలయ అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. ఈ కార్యక్రమాల వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆలయ ఈఓ, అర్చకులు అందజేశారు.
జూలై 19 (ఆదివారం): అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు) కార్యక్రమంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
ఆగస్టు 2 (ఆదివారం): ప్రధాన బోనాల ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రారంభిస్తారు.
ఆగస్టు 3 (సోమవారం): ఉదయం 8:30 గంటలకు ఉత్సవాల్లో అత్యంత కీలకమైన 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఉదయం 10:30 గంటలకు అమ్మవారి గజవాహన సేవ, జోగిను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.