భారతదేశం, జూన్ 17 -- తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన ఆషాఢ మాస బోనాల జాతరకు సికింద్రాబాద్ లష్కర్ సిద్ధమవుతోంది. ప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల ఉత్సవాల పూర్తి షెడ్యూల్‌ను ఆలయ అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. ఈ కార్యక్రమాల వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆలయ ఈఓ, అర్చకులు అందజేశారు.

జూలై 19 (ఆదివారం): అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు) కార్యక్రమంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.

ఆగస్టు 2 (ఆదివారం): ప్రధాన బోనాల ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రారంభిస్తారు.

ఆగస్టు 3 (సోమవారం): ఉదయం 8:30 గంటలకు ఉత్సవాల్లో అత్యంత కీలకమైన 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఉదయం 10:30 గంటలకు అమ్మవారి గజవాహన సేవ, జోగిను...