భారతదేశం, నవంబర్ 12 -- శని ప్రస్తుతం మీన రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2027 వరకు శని ఈ నక్షత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఐదు రాశుల వారికి రాబోయే 100 రోజులు చాలా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఈ కాలంలో ఐదు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితిలో చాలా సానుకూల మార్పులు వస్తాయి. ఈ కాలంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందే లిస్టులో ఏ ఐదు అదృష్ట రాశులు ఉన్నాయో చూడండి.

వృషభ రాశిలో జన్మించిన వారికి రాబోయే 100 రోజులు శని అనుగ్రహం వల్ల మీ కెరీర్‌లో మంచి ఫలితాలు వచ్చే యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే.. మీకు త్వరలో పనికి సంబంధించిన చాలా శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఈ కాలంలో వృషభ రాశి వారికి కొన్ని కొత్త బాధ్యతలు లభిస్తాయి. శని సంచారం కారణం...