వాయుగుండంగా బలపడిన అల్పపీడనం - ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
భారతదేశం, నవంబర్ 15 -- బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారుతోంది. అక్కడ ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఈ వాయుగుండం అండమాన్ దీవులకు 700 కిలోమీటర్లు, చెన్నైకి 860 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 1040 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం... ఈ వాయుగుండం రేపు (సోమవారం) తుపానుగా రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత ఎల్లుండి (మంగళవారం) నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి 'తీవ్ర తుపాను'గా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ తీవ్ర తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. దీని కారణంగా గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.