భారతదేశం, నవంబర్ 15 -- బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారుతోంది. అక్కడ ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఈ వాయుగుండం అండమాన్ దీవులకు 700 కిలోమీటర్లు, చెన్నైకి 860 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 1040 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం... ఈ వాయుగుండం రేపు (సోమవారం) తుపానుగా రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత ఎల్లుండి (మంగళవారం) నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి 'తీవ్ర తుపాను'గా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ తీవ్ర తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. దీని కారణంగా గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ...