వరంగల్, విజయవాడ మీదుగా మధురై-కాన్పూర్ సెంట్రల్ స్పెషల్ రైళ్లు.. ఈ తేదీల్లో
భారతదేశం, జూన్ 27 -- ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించడానికి, రైల్వేలు కాన్పూర్ సెంట్రల్, మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ స్పెషల్ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తాయి. దీంతో ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ప్రత్యేక రైళ్లు వరంగల్, విజయవాడ మీదుగా వెళ్తాయి.
ట్రైన్ నెంబర్ 01925 కాన్పూర్ సెంట్రల్-మధురై మధ్య 01.07.2026 నుండి 29.07.2026 వరకు నడుస్తుంది. ఈ సర్వీస్ కాన్పూర్ నుంచి బుధవారం ఉదయం 8.15 గంటలకు బయల్దేరి.. శుక్రవారం 7.15కి మధురై చేరుకుంటుంది.
01926 మధురై - కాన్పూర్ సెంట్రల్ ట్రైన్ 04.07.2026 నుండి 01.08.2026 వరకు నడుస్తుంది. శనివారం ఉదయం 02.30 గంటలకు బయల్దేరి.. సోమవారం ఉదయం 04.30 గంటలకు కాన్పూర్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు పోఖ్రాయాన్, ఒరాయ్, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.