భారతదేశం, జూన్ 27 -- ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించడానికి, రైల్వేలు కాన్పూర్ సెంట్రల్, మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ స్పెషల్ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తాయి. దీంతో ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ప్రత్యేక రైళ్లు వరంగల్, విజయవాడ మీదుగా వెళ్తాయి.

ట్రైన్ నెంబర్ 01925 కాన్పూర్ సెంట్రల్-మధురై మధ్య 01.07.2026 నుండి 29.07.2026 వరకు నడుస్తుంది. ఈ సర్వీస్ కాన్పూర్ నుంచి బుధవారం ఉదయం 8.15 గంటలకు బయల్దేరి.. శుక్రవారం 7.15కి మధురై చేరుకుంటుంది.

01926 మధురై - కాన్పూర్ సెంట్రల్ ట్రైన్ 04.07.2026 నుండి 01.08.2026 వరకు నడుస్తుంది. శనివారం ఉదయం 02.30 గంటలకు బయల్దేరి.. సోమవారం ఉదయం 04.30 గంటలకు కాన్పూర్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు పోఖ్రాయాన్, ఒరాయ్, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ,...