భారతదేశం, జూలై 6 -- ''అయిపోయిన పెళ్లికి భజంత్రిలు'' అన్నట్టు... నేడు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు సరిగ్గా అలాగే తయారైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పరంగా తిరుగులేని చట్టబద్ధత లభించి, నగర పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో... ఇప్పుడు మళ్లీ వైఎస్సార్సీపీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపడం హాస్యాస్పదంగా ఉంది. రాజధాని చట్టబద్ధం అయిపోయిన తర్వాత కూడా ఈ కపట ప్రదర్శనలు, ఈ వికృత నాటకాలు ఎందుకు చేస్తున్నట్లు.? రాజధాని విషయంలో 2014 నుండి నేటి వరకు కనీసం పదిసార్లు 'యూ-టర్న్' తీసుకున్న ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది! ఒకసారి మూడు రాజధానులు అని రాష్ట్ర భవిష్యత్తును మూడు ముక్కలాటగా మార్చారు. ఇంకోసారి ఆయనే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అం...