భారతదేశం, నవంబర్ 9 -- ంనఉన్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కలెక్టర్‌కు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత ధర్మాసనంలో అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్‌కు చట్టబద్ధమైన సమయం ఇస్తూ శిక్ష అమలును 4 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-A ప్రకారం నిషేధిత భూముల జాబితా నుంచి తమకు చెందిన కొన్ని ప్లాట్లను తొలగించాలని కోరుతూ బాధితులు గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు విన్...