భారతదేశం, నవంబర్ 3 -- ఉన్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులు, విద్యార్థులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బ్రిటన్ ప్రభుత్వం వీసా నిబంధనల్లో పలు కీలక మార్పులను ప్రకటించింది. 2027 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానాల్లో స్కిల్డ్ వర్కర్ల కనీస వేతన పరిమితులు, హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్ (హెచ్‌పీఐ) వీసా విస్తరణ, గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి పొడిగింపు వంటివి ఉన్నాయి.

అక్టోబర్ 28న హెచ్‌ఎమ్‌ ట్రెజరీ సమర్పించిన యూకే బడ్జెట్ 2026లో ఈ ప్రతిపాదనలను పొందుపరిచారు. తక్కువ, మోస్తరు నైపుణ్యం కలిగిన వలసలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తూనే.. నిపుణులైన విదేశీ ఉద్యోగులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలనేది బ్రిటన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం బ్రిటన్‌లో ఉద్యోగాలు పొందే విదేశీయులు, అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగం కోల్పోయిన స్పాన్సర్డ్ ఉద్యోగులపై ప్రభావం చూప...