భారతదేశం, మే 23 -- కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాల వేళ పుణ్యస్నానాలు ఆచరించాలనుకునే భక్తులకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన అవకాశం కల్పించింది. హైదరాబాద్ నుండి కాళేశ్వరానికి ప్రత్యేక ఏసీ బస్సుల ద్వారా 'కాళేశ్వరం ప్యాకేజీ టూర్లను' అధికారికంగా ప్రకటించింది.

ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భక్తులు పవిత్ర పుష్కర స్నానం ఆచరించడంతో పాటు, స్వయంభూ శ్రీ ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అంతేకాదు, యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించేలా ఈ రూట్ మ్యాప్‌ను డిజైన్ చేశారు. భక్తుల బడ్జెట్, సౌకర్యాలకు అనుగుణంగా టూరిజం కార్పొరేషన్ రెండు రకాల ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.

ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతన ఏసీ బస్సులను కేటాయించారు. సీట్ల రకాన్ని బట్టి ధరలు ఉన్నాయి: ఏసీ హైటె...