భారతదేశం, జూలై 17 -- తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి పర్యాటక కళ రానుంది. కృష్ణా నది తీరాన వెలిసిన ఈ దివ్యక్షేత్రాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మట్టపల్లి క్షేత్రంలో పర్యాటక వసతుల కల్పనతో పాటు, బోటింగ్ సౌకర్యాల ఏర్పాటు కోసం రూ. 13 కోట్ల పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణి ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. మట్టపల్లి ఆలయాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) రం...