భారతదేశం, నవంబర్ 25 -- సోమవారం నాటి భారీ నష్టాల నుంచి కోలుకున్న బ్యాంక్ నిఫ్టీ బుధవారం ఉదయం లాభాల బాట పట్టింది. క్రితం ముగింపు 62,585తో పోలిస్తే ఇంట్రాడేలో సుమారు 2 శాతం పెరిగి 63,981 గరిష్ఠ స్థాయిని తాకింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీలోని 9 ప్రైవేట్ బ్యాంకు షేర్లలో ఫెడరల్ బ్యాంక్ మాత్రమే నష్టాల్లో ట్రేడ్ కాగా, మిగిలిన 8 బ్యాంకు షేర్లు చెప్పుకోదగ్గ లాభాలను నమోదు చేశాయి. ఈ జోరు మధ్య పోర్ట్‌ఫోలియోలో కొత్తగా ప్రైవేట్ బ్యాంకు షేరు చేర్చాలనుకునే ఇన్వెస్టర్లకు కాస్త తికమక పరిస్థితి ఎదురవుతోంది.

బ్యాంకింగ్ షేర్ల కదలికలు భారత స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో 2026 రెండో త్రైమాసిక (క్యూ2) ఫలితాల తర్వాత నిఫ్ట...