భారతదేశం, జూన్ 19 -- SCR Radhikapur Bengaluru ExpressTrain Diversion :రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్‌డేట్ ఇచ్చింది. సదరన్ రైల్వే పరిధిలోని మద్రాస్ డివిజన్, అరక్కోణం (AJJ) రైల్వే స్టేషన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా నాన్-ఇంటర్‌లాకింగ్ (NI) ప్రోగ్రామ్ పనులు చేపట్టారు. ఈ సాంకేతిక పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే ఒక ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటనలోని సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని రాధికాపూర్ నుంచి బెంగళూరు వెళ్లే రాధికాపూర్ - SMVT బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 16224) జూన్ 21, 2026 నాటి సర్వీసును దారి మళ్లిస్తారు. ఫలితంగా నిర్దేశిత సాధారణ మార్గానికి బదులుగా దారి మళ్లించిన రూట్‌లో రాకపోకలుంటాయి.

ఈ తాత్కాలిక మార్పుతో ఆ రైలు తన రెగ్యులర్ రూట్...