భారతదేశం, మార్చి 4 -- హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బీటెక్ విద్యార్థినిపై క్లాస్ రూమ్‌లోనే ఓ విద్యార్థి అత్యాచారం చేశాడు. అంతేకాదు వీడియోలు, ఫొటోలు తీసి.. పలుమార్లు బెదిరిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడితో కూడా అఘాయిత్యం చేయించేందుకు ట్రై చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పోలీసులు, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఒక యువతి.. బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆశిష్ అనే యువకుడు అదే కాలేజీలో చదువుతున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని రోజులకు యువతికి ఆశిష్ ప్రపోజ్ చేశాడు.

2023లో బెదిరించి కాలేజీలోనే ఒక క్లాస్ రూమ్‌లో అత్యాచారం చేసినట్టుగా బాధితురాలి ఫిర్యాదులో పే...