భారతదేశం, అక్టోబర్ 19 -- తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. సాధారణ రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, పొడవైన వెయిట్‌లిస్ట్ జాబితాను దృష్టిలో ఉంచుకుని రేపల్లె - చర్లపల్లి - రేపల్లె (ట్రైన్ నంబర్లు 07227/07228) మధ్య 'ఆన్ డిమాండ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్' రైలును నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

ఈ ప్రత్యేక రైలు ఒక రౌండ్ ట్రిప్ సర్వీసుగా అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసు ప్రయాణికుల ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా మార్చడంతో పాటు పండుగల తదనంతర రద్దీని నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

రేపల్లె - చర్లపల్లి మధ్య ప్రయాణించే ఈ ప్రత్యేక రైలు రెండు వైపులా ప్రయాణికుల సౌకర్యార్థం పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడిం...