భారతదేశం, సెప్టెంబర్ 7 -- రియల్ ఎస్టేట్ రంగంలో గుర్తింపు పొందిన ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) నేటి నుంచి (సెప్టెంబరు 7) ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబరు 9న ఈ ఇష్యూ ముగియనుంది. కంపెనీ తన షేరు ముఖ విలువ రూ. 10 కాగా, ఐపీఓ ధరల శ్రేణిని (Price Band) రూ. 118 నుంచి రూ. 124గా ఖరారు చేసింది. నేడు ఉదయం 10:00 గంటలకు బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ ఐపీఓలో పాల్గొనే ఇన్వెస్టర్లు కనీసం 120 షేర్లను (ఒక లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 120 గుణింతాల్లో బిడ్లు దాఖలు చేయవచ్చు. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరుకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ. 44 వద్ద కొనసాగుతోంది. జీఎంపీని పరిగణనలోకి తీసుకుంటే, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈ షేరు రూ. 168 వద్ద లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల...