భారతదేశం, ఫిబ్రవరి 8 -- శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం చేస్తారు. అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహిస్తారు.
రాత్రి 7 గంటలకు భేరీ పూజ, భేరీ తాండవం ఉంటుంది.ఆ తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈనెల 9వ తేదీ నుంచి ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తారు. శివదీక్షా భక్తులకు నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు శ్రీమల్లికార్జునుడి స్పర్శ దర్శనం కల్పిస్తారు. ప్రతి రోజూ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరం ఎద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.